విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

నల్లగొండ,జూలై17(జ‌నం సాక్షి): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకలు కోరారు. స్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, టీవీవీ, ఏఐఎఫ్‌డీఎస్‌, బీసీయూఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన జేఏసీ ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఇచ్చిన హావిూ మేరకు కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్యను అమలు చేయాలని కోరారు. విద్యార్థులు లేరనే సాకుతో హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను రద్దు చేయటం సరికాదన్నారు. సీపీఎస్‌ రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.