విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత కీలకం

విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, తద్వారా పోటీతత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో 7 నుండి 10 వ తరగతి  విద్యార్థినీ విద్యార్థులకు వార్షిక  క్రీడా పోటీలు నిర్వహించారు . ముఖ్య అతిథిగా హాజమైన జిల్లా కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ గావించి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, గెలుపు ఓటమిలే కాకుండా పాల్గొనడమే ముఖ్యమని, శారీరకంగానే కాకుండా మానసిక ధృఢత్వంతో పాటు పోటీతత్వం పెరుగుతుందని, అన్ని రంగాలలో రాణిస్తారని, విద్యార్ధి దశలో ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు.  తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. విద్యార్థి దశలోనే ఎలాంటి ఒత్తిడులు లేకుండా క్రీడలపై శ్రద్ధ పెట్టవచ్చునని, విద్యార్ధి దశను ఆహ్లాదకరంగా ఆస్వాదించాలని, మీకు ఎంతో ఉజ్వల భవిష్యత్ వుందని, మీరందరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.ఈ సందర్భంగా రీజినల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారిణి హరిణిరెడ్డి, రీజనల్ స్థాయి హైదరాబాదులో జరిగిన  జావెలిన్ త్రో లో రజత పతకం సాధించిన కుశాల్ రెడ్డిని జిల్లా కలెక్టరు అభినందించారు.కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్  ప్రియారాణి, జాతీయ హాకీ కీడాకారులు ఆయాకత్ అలీఖాన్, జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా యువజన అధికారి ధనంజయ్, ప్రభుత్వ-లికల జూనియర్ ‘ కాలేజీ ప్రిన్సిపల్ చంద్రకళ, పేరెంట్స్ కమిటీ మెంబర్ జ్యోతి, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.