విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించడం పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
పాల్వాయి స్రవంతి గెలుపు కోసం వెన్నంటి ఉండి పని చేస్తమని తెలియజేసారు. మునుగోడు అభ్యర్థి స్రవంతి గెలుపు కోసం మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్ని తాయిలాలు ఇచ్చినా మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్దపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు గతంలో అమలు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించి బిజెపి-టిఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, పార్టీ అనుబంధ సంఘాలన్నీ స్రవంతి గెలుపుకోసం సైనికుల్లా పనిచేస్తామని, ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఇంటింటికి వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేస్తామని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు ఉండేవిధంగా మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును చేతి గుర్తుకు ఓటేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నికల్లో గెలుపులాగే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా తమ పార్టీ శ్రేణులంతా ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పని చేస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.