విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
పాల్గొన్న సర్పంచ్ రాణి కృష్ణారెడ్డి
బిచ్కుంద ఆగస్టు 08 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల గుండెనెమ్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాటూరి రాణి కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల జిల్లా సంఘం అధ్యక్షుడు సిద్ధిరాం పటేల్ మరియు పాఠశాల చైర్మన్ నేరడి విట్టల్, ప్రధానోపాధ్యాయుడు బి విట్టల్ రెడ్డి, సి ఆర్ పి ప్రమోద్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.