విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి..

 

జనంసాక్షి /పెద్దశంకరంపేట అక్టోబర్ 22, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్లస్టర్ నోడల్ అధికారి విట్టల్ అన్నారు శనివారం మండల పరిధిలోని చిలపల్లి ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే పనితీరు తరగతి గదిలో వారీగా పరిశీలించి తొలి మెట్టు కార్యక్రమం విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన ఉపాధ్యాయులకు వివరించారు తొలి మెట్టు కార్యక్రమం పై ఉపాధ్యాయులు వెళ్లగొచ్చిన సందేహాలను ఆయన నివసి చేసి ప్రభుత్వ పాఠశాల ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేసిందని దీని విధిగా పాఠశాల అమలుపరచాలని సూచించారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా ఆయనే వడ్డించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్ర చారి.. ఉపాధ్యాయులు గోపి . రత్న ఉమాప్రసన్న తదితరులు పాల్గొన్నారు..