విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి..

వసతుల కల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలి.
– మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రావు.
ఊరుకొండ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి):
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, మౌలిక వసతుల కల్పనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖర రావు సూచించారు. సోమవారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట లోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్, ఎంపీఓ వెంకటేష్, హాస్టల్ వార్డెన్ రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.