విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేసిన గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్
బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి):
బాన్సువాడ మండలం హన్మాజిపెట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలలో గురువారం గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకురాలు విజయ మాహాలక్ష్మి తో కలిసి విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోనాల సుభాష్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో నులిపురుగుల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం నులిపురుగుల నిర్మూలన జాతీయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాత్రలు వేయడం జరుగుతుందని గ్రామంలోని చిన్నారులందరికీ మాత్రలు వేయించాలని, అలాగే విద్యార్థులు పాఠశాలలో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, తమ ఇండ్ల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేటట్లు చూసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకురాలు విజయ మహాలక్ష్మి, పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ పురుషోత్తం, ఉప సర్పంచ్ అక్బర్, వార్డు సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|