విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ…
వరంగల్ బ్యూరో: అక్టోబర్ 20 (జనం సాక్షి)
వరంగల్ లోని ప్రభుత్వ సహాయక వాణి ప్రాథమిక పాఠశాలలో అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి పదవి విరమణ పొందిన శ్రీ సిహెచ్ చంద్రయ్య, సూర్య కళ రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు దంపతులు శకుంతల జ్ఞాపకార్థం పదివేల రూపాయల నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు మొదలగునవి పిల్లలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు చెప్పే విషయాలను నేర్చుకొని మంచిగా చదువుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ ఇందిర, ఉపాధ్యాయులు పూజారి మనోజ్ కుమార్ గౌడ్, ఎం సుజాత, కె నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు.
Attachments area