-విద్యార్థులకు మండల మరియు జిల్లాస్థాయి లో సైన్స్ సెమినార్.

జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు18(జనంసాక్షి):

విద్యార్థులలో శాస్త్రీయ పరిశీలనా ధోరణి, విశ్లేషణాత్మక ఆలోచనలను పెంచడం కొరకు మండల స్థాయిలో మరియు జిల్లాస్థాయిలో సైన్స్ సెమినార్ ను నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు ఒక ప్రకటన లో తెలిపారు.సెమినార్ అంశము: సుస్థిర అభివృద్ధి కొరకు ప్రాథమిక సామాన్య శాస్త్రం దృక్పతాలు సవాళ్లు.మండల స్థాయి లో ఈ నెల 30న,జిల్లాస్థాయిలో సెప్టెంబర్ 09న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో చదువుతున్న 8వ, 9వ మరియు 10వ తరగతి విద్యార్థులు సెమినారుకు అర్హులు అని అన్నారు. సెమినార్ లో పాల్గొన్న విద్యార్థులు సెమినార్ అంశమును ఆరు నిమిషాల లోపు పూర్తి చేయవలెనని అన్నారు.సెమినార్ అంశములు చెప్పేటప్పుడు చార్ట్స్ గాని, ఎయిడ్స్ గాని, సిడిలు గాని ఉపయోగించుకోవచ్చునని అన్నారు. సెమినార్ అంశము లో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని సైన్సు ఉపాధ్యాయులకు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి9989921105ని సంప్రదించాలని సూచించారు.