విద్యార్థులకు మధ్యాహ్నం భోజనానికి అందని త్రాగునీరు పట్టించుకోని ఉన్నత స్థాయిఅధికారులు అసలే అది మారుమూల గ్రామం అరకొరగా వసతులు ప్రాథమిక పాఠశాల కు నీటి కష్టాలు
ఏటూరు నాగారం మండలంలోని కోయగూడా ఎల్లాపూర్ రాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలోగల ప్రాథమిక పాఠశాల పాప్కాపురం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయుటకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులను విద్యార్థులు ఉపాధ్యాయులు వంట చేసే మహిళా సంఘాల సభ్యులు ఎదుర్కొంటున్నామని పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ ధార సమ్మక్క అన్నారు పాఠశాల లో సుమారు 50 మంది విద్యార్థులతో విద్యాబోధన జరుగుతుందన్నారు పాఠశాల ఆవరణలో గల మూత్రశాలలు బాత్రూంలో శుభ్రం చేయుట లేదు నీళ్లు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గ్రామపంచాయతీ సిబ్బంది పాఠశాలకు వచ్చి శుభ్రం చేయుట లేదు పాఠశాలను ఉపాధ్యాయులు చీపురు కట్ట పట్టుకొని శుభ్రం చేసుకునే పరిస్థితి ఉన్నదన్నారు.పాఠశాలలో గతంలో చేతిపంపు నీటి సహాయంతో విద్యార్థులకు వంట చేసేవారు భగీరథ పైప్లైన్ వచ్చినప్పటి నుండి భగీరథ నీటితోనే వంటలు చేస్తున్నారు.కరోనా కాలంలో చేతిపంపు తుక్కుపట్టి పోవడంతో గ్రామపంచాయతీ సిబ్బంది పంపు సామాన్లను పైపులు వంటివి తీసుకొని వెళ్ళిపోయినారు.అప్పటి నుండి భగీరథ నీటి సౌకర్యాలు సక్రమంగా లేనందున రానందున నీటి కోసం దూర ప్రాంతాల పొలాల వద్ద ఉన్న మోటార్ల వద్దకు వెళ్లి వంట చేసేవారు త్రాగునీటిని తీసుకుని వస్తున్నారు మధ్యాహ్న భోజనం వంటలు చేయడం కష్టతరంగా మారిందని వంట చేసే కార్మికులు ఎస్ ఎం సి కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నామన్నారు.గత పది రోజుల నుండి భగీరథ నీరు రావడం లేదు సంబంధిత అధికారులకు ఫోన్ చేసినప్పటికీ వారు సమాధానం ఇవ్వడం లేదు ఇలా ఎన్ని రోజులు ఇట్టి అవస్థలు ఎదుర్కోవలసి వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.గతంలో ఎంపీడీవో,సర్పంచ్ ,స్పెషల్ ఆఫీసర్,వంటి అధికారులను విన్నమించిన ఫలితం శూన్యం ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ స్పందించి పాఠశాలలో త్రాగునీటి కోసం ఒక చేతిపంపు ఏర్పాటు వేయించాలని ఎస్ఎంసి కమిటీ చైర్మన్ ధార సమ్మక్క ,ప్రధానోపాధ్యాయులు,ఎండి సర్వర్ అహమ్మద్, ఉపాధ్యాయులు ఎస్ఎంసి కమిటీ సభ్యులు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.