విద్యార్థులకు సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలి..

ఫోటో రైట్ అప్…. వనపర్తి డిపో సిబ్బంది టి కె. రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ, నాయకులు
*===========================*

వనపర్తి టౌన్ : నవంబర్ 21 ( జనం సాక్షి )వనపర్తి జిల్లాలో అనేక గ్రామాలనుండి వచ్చే విద్యార్థులకు సమయానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం వనపర్తి డిపో సిబ్బంది టి.కే రెడ్డి కి ఎస్ఎఫ్ఐ,ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ,వివిధ గ్రామాల నుంచి వనపర్తి జిల్లా కేంద్రంలో వందలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి నెల వందల రూపాయలు పెట్టి బస్సు పాసులు తీసుకుంటున్న వారికి మాత్రం సమయానికి అనుగుణంగా బస్సు సౌకర్యాలు లేకపోవడంతో వనపర్తి జిల్లా కేంద్రానికి ఉదయం 11 గంటలకు చేరుకోవడం జరుగుతుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో మాదిరిగానే రేమద్దుల మీదుగా, రాజాపూర్, సింగాయిపల్లి, మాచుపల్లి,తిరుమలాపూర్, మున్ననూర్, అప్పాయి పల్లి మీదుగా బస్సులు నడిపించి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా సమస్యలను పరిష్కరించాలని, వనపర్తి డిపో సిబ్బందిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించిన వారిలో ఎస్ఎఫ్ఐ, జిల్లా కమిటీ సభ్యులు కుమార్,యుగంధర్,వంశీ,మహేష్ తదితులున్నారు.