13 నుంచి 25 వరకు దసరా హాలిడేస్
ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు ఈ నెల 13 నుంచి 25 వరకు
ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు
హైదరాబాద్:
బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని పేర్కొన్నది.