విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి

హుజూర్ నగర్ ఆగస్టు 17 (జనం సాక్షి): విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి లయన్స్ క్లబ్ ఆఫ్ పొంచర్ల కార్యదర్శి పిన్నాని కోటేశ్వరరావు కూన్రెడ్డి నాగిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని యుపిఎస్ నెంబర్ 2 జిప్సీ చైల్డ్ కేర్ హోమ్ అనాధాశ్రమం యుపిఎస్ మాధవరాయణం గూడెం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ పోంచర్ల ఆధ్వర్యంలో  అధ్యక్షులు దంతూరి సైదుల్ గౌడ్ సహకారంతో  రాత పుస్తకాలు, పెన్సిల్లు, ఎరైజర్లు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పొంచర్ల కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే మంచి నడవడిక సంస్కృతులను నేర్చుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పొంచర్ల కోశాధికారి సోమగాని రాంప్రసాద్, బోళ్ళ గోవిందరెడ్డి , కోలా నాగేశ్వరరావు, ఆర్ సాయి త్రిలోక్, నాగేంద్రబాబు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, సూరేపల్లి దేవుడు, భూక్య ధన్ పాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.