విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి

– ముస్లిమ్ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఘనంగా డాక్టర్ మౌలానా జయంతి వేడుకలు
హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలకు  చేరుకోవాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజుర్ నగర్ పట్టణంలోని ముస్లిం మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన మైనారిటీ డే  వేడుకకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరై డాక్టర్ మౌలానా అబుల్ కాలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి, జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హుజుర్ నగర్ మైనారిటీ స్కూల్ విద్యార్థుల మర్చిఫాస్ట్ అందర్నీ ఆకట్టుకుందన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ స్కూల్ విద్యార్థులు చక్కగా చదువుతున్నారని, ఆటలలో కూడా చక్కగా ప్రతిభను కనబరుస్తున్నారన్నారు.  విద్యార్థులు ఏకాగ్రతతో క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తద్వారా తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉన్న ఊరుకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు తెలిపారు. సమయ పాలన చాలా అవసరమని లక్ష్యాలు పెద్దగా ఉండాలని వాటిని సాదించే కోరిక బలంగా ఉండాలని, సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అదేవిదంగా ఉపాధ్యాయులను కూడా అభినందిస్తూ, పిల్లలకు అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందించాలన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, కౌన్సిలర్ దొంగరి మంగమ్మ, మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయినీలు, విద్యార్థినీలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.