విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలి.

జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య. 
ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి.
కలెక్టర్ పి ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 17(జనంసాక్షి):
విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య అన్నారు.బుధవారం నాగర్ కర్నూల్ క్రీడా మైదానంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్, తగ్గ ఫర్ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు జిల్లాస్థాయి క్రీడలను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరిలతో కలిసి ఆమె జిల్లాస్థాయి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ….క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని,శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడ మైదానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామస్థాయి క్రీడలను ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో  రాణించే అవకాశం ఉందన్నారు.
కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్:
జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…
క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకే మండల స్థాయిలో క్రీడలను నిర్వహిస్తు‍న్నా రన్నారు. ప్రతి క్రీడల నుండి 26 జట్లు రావడం జిల్లాస్థాయిలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు.ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యత  ఇవ్వాలన్నారు.ప్రతి విద్యార్థి ఇష్టమైన క్రీడను ఎంచుకొని అందులో రాణిస్తే రాష్ట్ర జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కన పరచ వచ్చు నన్నారు.క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతోపాటు మనోరంజక సాధనాలలో ముఖ్యభాగమై పోతుందన్నా రు.సాంప్రదాయకమైన ఆటల తోపాటు, ఆధునిక ప్రపంచ గుర్తింపుగల పోటీ ఆటలలో ప్రావీణ్యము సంపాదిస్తే, పేరు, ప్రతిష్ఠలతో పాటు మంచి ఆదాయము లభించే అవకాశాలున్నాయని సూచించా రు.యువత ఆ విధంగా క్రీడలపై దృష్టి సారించాలని కోరారు. ఈకార్యక్రమంలో డిపిఓ కృష్ణ, డిఆర్డిఓ నర్సింగరావు, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, సిపిఓ భూపాల్ రెడ్డి, డిపిఆర్ఓ సీతారాం, జిల్లా వయోజన విద్యాధికారి శ్రీనివాసరెడ్డి, ఎస్ జి ఎఫ్ ప్రసాద్ గౌడ్, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర శెట్టి, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, శేఖర్ బాబు, శ్రీనివాస్ గౌడ్, రామన్ గౌడ్,రవి, సత్యనారాయణ, వెంకటేష్, రాజు గౌడ్ లు కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్, తగ్గ ఫర్ క్రీడా పోటీలను కొనసాగించారు.
గెలుపొందిన జట్టులకు జిల్లా కలెక్టర్ చే బహుమతులు ప్రత్యేక తేదీల్లో చేయనున్నారు.