విద్యార్థులు చట్టాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటే భవిష్యత్ రాజ్యమార్గమే – జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు

నాగర్ కర్నూల్ జిల్లాబ్యూరో నవంబర్9జనంసాక్షి:
కళాశాల స్థాయిలో యువత ఏమాత్రం తప్పటడుగులు వేసినా భవిష్యత్‌లో జీవితం అంధకారంగా మరే అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు విద్యార్థులకు సూచించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో లీగల్ లిటరసీ డే సందర్భంగా జిల్లా కోర్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ సేవ సదస్సు నిర్వహించి చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ….
 విద్యార్థులు చట్టాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే భవిష్యత్ రాజ్య మార్గంలో పయనిస్తుందని అన్నారు.
 మహిళల పట్ల సోదరభావంతో మెలుగుతూ సాధ్యమైన సహకారాన్ని అందించాలన్నారు. ప్రజలందరికీ న్యాయాన్ని అందించే గురుతర బాధ్యత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌  న్యాయమూర్తులపై పెట్టారన్నారు. కాలేజీలో రాగింగ్‌ చేస్తే జరిగే పర్యవసానాలపై విద్యార్థులకు ఆయన వివరించారు.
జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి చదువు తప్ప వేరు మార్గం లేదన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి వృత్తిలో నైపుణ్యత సంపాదించుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలన్నారు.
కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి, కళాశాల అభ్యున్నతికి పాటుపడాలన్నారు.
విద్యాబుద్ధులు నేర్పిన కళాశాలకు మౌలిక వసతులు కల్పించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ….
విద్యార్థులు చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు మోటారు సైకిళ్ళు నడపకూడదని, తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉంటేనే వాహనాలు నడపాలన్నారు.
విద్యార్థులు ఫోక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలన్నారు.అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికపరమైన ఘటనలు జరుగుతే చట్టంలో ఇద్దరికీ సమాన హక్కులు కల్పించిందని తెలిపారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ స్వరూప మాట్లాడుతూ….
మైనర్లు అవగాహన లేక పోవడం వల్ల తల్లిదండ్రులకు సంబంధం లేకుండానే బాల్య వివాహాలను చేసుకుని, తర్వాత మనస్పర్దాలతో కోర్టులకు ఆశ్రయించి కేసులు పెట్టుకుంటున్నారని తెలిపారు.
సమాజం, చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడం భవిష్యత్తుకు మంచిదన్నారు.
రెండవ అదనపు జూనియర్ జడ్జీ మౌనిక మాట్లాడుతూ చట్టాలకు లోబడి విద్యార్థులు ఉండాలన్నారు.
చదువుకు ఆటంకం కలగకుండా భవిష్యత్తును ఎంచుకోవాలన్నారు.
చట్టాల అవగాహన తప్పక తెలిసి ఉండాలి అన్నారు.
ఈ న్యాయ సేవాసదనంలో నోడల్ అధికారి వెంకటరమణ, నాగర్ కర్నూల్ సీఐ జక్కుల హనుమంతు, కళాశాల ప్రిన్సిపల్ లలిత, ప్రభుత్వ న్యాయవాదులు భవాని, శ్యాం ప్రసాద్ న్యావాదులు రాంబాబు, బునాసి రామచందర్ తిరుపతయ్య రామకృష్ణ యాదవ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, లెక్చరర్ నరసింహులు కళాశాల ఉపన్యాసకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.