విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

 

 

 

;-ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలి

;-అండర్-19 టెన్నిస్ బాల్ క్రికెట్ టీం జాతీయస్థాయి సెలక్షన్ కార్యక్రమంలో సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పిలుపు

;-కరీంనగర్, ఆగస్టు 13విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, క్రీడలు సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, స్నేహ బాంధవ్యానికి దోహదపడతాయని పార్టీ నగర అధ్యక్షుడు తెలంగాణ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయస్థాయి అండర్-19 టెన్నిస్ బాల్ క్రికెట్ తెలంగాణ జట్టు సెలెక్షన్ మహోత్సవానికి తెలంగాణ మైనార్టీ గురుకులాల తరపున గులాం అహ్మద్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ జట్టు ఎంపికయ్యాక, జమ్మూ లో జాతీయస్థాయిలో ఆడి, తెలంగాణ కీర్తిపతాకను దేశవ్యాప్తంగా ఇనుమడింప జేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, అంతర్జాతీయ టెన్నిస్ బాల్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ లతీఫోద్ధీన్ సేవలు, కరీంనగర్ మైనార్టీ గురుకుల పిఇటి బానోత్ రాజు సేవలు అభినందనీయమన్నారు. వీరి కృషి ఫలంగా మైనార్టీ గురుకులాల పేద విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో క్రికెట్ ఆడేందుకు, ఓపికతో ప్రోత్సాహిస్తున్న తీరు మాటల్లో చెప్పలేనిదన్నారు.

తాజావార్తలు