విద్యార్థులు పఠానాసక్తి పెంపొందించుకోవాలి…
వరంగల్ బ్యూరో: అక్టోబర్ 21 (జనం సాక్షి)
విద్యాశాఖ- ప్రేరణ ఫౌండేషన్ – పోతన విజ్ఞాన పీఠం సంయుక్త ఆధ్వరంలో శుక్రవారం పోతన విజ్ఞాన పీఠంలో రీడ్ కాంపెయిన్ 100 రోజుల ముగింపు కార్యక్రమము జరిగింది.
వరంగల్ జిల్లా రీడ్ కన్వినర్ అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా హాజ్జరైన జిల్లా కలెక్టర్ డా.బి.గోపి మాట్లాడుతూ బాల బాలికలు చిన్న నాటి నుండి పఠనాసక్తి నీ పెంపొందించుకొని విజ్ఞాన వంతులుగా ఎదుగుతూ సమాజంలో ఉన్నత స్థానానానికి చేరుకోవాలని, అలాగే సమయాన్ని వృధా చేయకండా ప్రతి ఒక్కరు తమ పాఠ్య పుస్తకాలే కాకుండా, ఇతర అంశాలలోని పుస్తకాలను, వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని, ముఖ్యంగా మీకు నచ్చిన పుస్తకానీ పఠిస్తే తము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సులువగా ఉంటుందన్నారు._ స్వచ్చంద సంస్థలు, దాతల నుండి సుమారు ఒక లక్ష యాభైవేల రూపాయల విలువగల పుస్తకాలను (విద్య, వైద్య, సాంస్కృత, సాహిత్య, సామాజిక ) రంగాలే కాకుండా నీతి కథలు జాతీయ నాయకుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను అందించడం అభినందనియామని అన్నారు. ఇదే స్ఫూర్తితో వరంగల్ జిల్లాలోని దాతలు ముందుకు వచ్చి తమ దగ్గర ఉన్న పుస్తకాలను తమ సమీప పాఠశాలలకు అందజేయాలని కోరారు._
_ఇంకా ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసుంతి. ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, స్వరూప, మండల పరశురాములు సెక్రటరీ క్రిష్ణమూర్తి, బూర రాంచందర్ వనపర్తి పద్మావతి, అనుమాండ్ల నాగరాజు, కెమల్లారెడ్డి, డా.రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్ నిమ్మల శ్రీనివాస్, డా. అమాష, స్రవంతి మరియు 300 మంది విద్యార్థిని విద్యార్థులు పోతన విజ్ఞాన పీఠం సిబ్బంది పాల్గొన్నారు._
Attachments area