విద్యార్థులు రోల్ మోడల్ గా ఉండాలి

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాకీర్ హుస్సేన్
వీపనగండ్ల నవంబర్ 11 (జనంసాక్షి) ప్రభుత్వ జూనియర్ కళాశాల వీపనగండ్ల యందు శుక్రవారం రోజు నిర్వహించుకున్న ప్రథమ సంవత్సర విద్యార్థుల స్వాగత సమావేశమునకు ముఖ్యఅతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాకీర్ హుస్సేన్ మరియు గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్య క్రమాలతో అలరించడం జరిగింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో నుండి విద్యార్థుల యొక్క ప్రతిభ బయటకు వస్తుందని తెలియజేశారు. విద్యార్థులు విద్యను ఒక ఫ్యాషన్ గా మార్చుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉండాలని సూచించారు.
సర్పంచ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల యొక్క స్వేచ్ఛను క్రమశిక్షణతో ఉపయోగించుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రులను అధ్యాపకులను మోసం చేసే విధంగా విద్యార్థులు యొక్క ప్రవర్తన ఉండరాదని తెలిపారు. కళాశాల యొక్క విద్యార్థుల సంఖ్యను పెంపొందించుటకు కళాశాలకు క్రీడా సామాగ్రిని అందించుటకు సమ్మతించారు.
ఈ కార్యక్రమంలో డిఐఒ ఆఫీస్ సూపర్డెంట్ రఘు తో పాటు ప్రిన్సిపల్ బి రామ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, రవి, కల్పన, ఆనంద్, విజయ్, మహిపాల్ రెడ్డి, జి రవీందర్, కే సుధాకర్, పాండురంగం రెడ్డి, పాల్గొన్నారు.

తాజావార్తలు