విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడం అభినందనీయం

విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడం అభినందనీయంసూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుటకు శ్రీవేదాంత భజన మందిరం ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, కౌన్సిలర్ మోరిశెట్టి సుధారాణి శ్రీనివాస్ లు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీవేదాంత భజన మందిరంలో సీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు శ్రీరామకృష్ణ విద్యా మందిర్ నిర్వాహకులు నాగవెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఆధ్యాత్మిక క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఉన్నతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మన ప్రాచీన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భావిపౌరులైన మన విద్యార్థులకు అందించి వారిలో నైతిక మానవతా విలువలను నిర్మాణం చేయాలని సత్సంకల్పంతో గత 15 ఏళ్లుగా మందిర ప్రాంగణంలో ఆధ్యాత్మిక  క్విజ్ పోటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడం అభినందనీయమన్నారు.ప్రస్తుతం విద్యా రంగంలో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ సమాజంలో ప్రతిరోజు అనేక ఆకృత్యాలు జరుగుతున్నాయని దీనికి కారణం బాల్య దశలో విద్యార్థులకు ఆధ్యాత్మిక మానవతా విలువలు బోధించకపోవడమే కారణమన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపై ఎక్కువగా ఉందన్నారు.అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బెలిదే శ్రీనివాస్ సహకారంతో నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ , మందిర అధ్యక్ష కార్యదర్శులు రాచర్ల వెంకటేశ్వరరావు , నకరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్ , మందిర ప్రధాన అర్చకులు ధరూరి సింగరాచార్యులు, ధరూరి రాఘవాచార్యులు, కమిటీ సభ్యులు వీరవెల్లి రామ్మూర్తి , వాడకట్టు ఆంజనేయులు, సోమ ధనుంజయ్, సోమ సుమన్, కక్కిరేణి విజయ్ కుమార్, షీలా శంకర్, ఓరుగంటి చంద్రశేఖర్, బచ్చుపురుషోత్తం, భానుపురి శ్రీనివాస భజన మండలి అధ్యక్షులు నాగవెల్లి దశరథ, పలు పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.