విద్యార్థుల ఔదార్యం
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన ఇద్దరికి కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థులు ఆర్థిక సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అశ్వారావుపేట వీకేడీవీఎస్‌రాజు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 5 రోజుల క్రితం గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తూ జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రూ. 21వేలు విరాళాలు సేకరించి గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి.శేషణబాబు, ఇతర అధ్యాపకులు ఉన్నారు.