విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి – డిఈఓ గోవిందరాజులు
అచ్చంపేట ఆర్సీ, 15 నవంబర్ 2022,(జనం సాక్షి న్యూస్ ): అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్, బొమ్మన్ పల్లి, ఐనోల్ గ్రామాలలోని ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాల, పాఠశాలాలను జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డిఈఓ పాఠశాలలోని విద్యార్థులతో విద్యా సంబంధ మైన విషయాలపై ముచ్చటించారు. పాఠశాలల్లో ని విద్యాప్రమాణాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి విద్యార్థిలో తనదైన ఒక శక్తి సామర్థ్యం ఉంటుందని ఉపాధ్యాయులు బోధించే సందర్భంలో విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వెలికి తీయడమే కాకుండా అందులో వారిని మరింత ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను సూచించారు. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాల కు హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో 3, 4, 5 వ తరగతి విద్యార్థులతో ప్రశ్నలు అడిగి వారినుండి జవాబులు రాబట్టారు. ప్రతి విద్యార్ధి కి యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలని అప్పుడే విద్యార్ధి యొక్క విద్య విజ్ఞాన సామర్థ్యాలు తెలుస్తుందన్నారు.
పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కావున
విద్యార్థులు ఇప్పటినుండే పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయపాలన పాటించాలని, తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ ను వినియోగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సతీష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.