*విద్యార్థుల సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుంది*
సాయిగాయత్రి పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్
మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): విద్యార్థి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్ అన్నారు. మండల కేంద్రంలో ఉన్న సాయిగాయత్రి విద్యాలయంలో గురువారం తమ విద్యార్థి విద్యార్థుల్లో ప్రయోగాత్మకంగా తయారుచేసిన అగ్రికల్చర్ హైడ్రాలిక్ బ్రిడ్జి నీటి నిలవ సోలార్ పద్ధతిలో విద్యుత్ సరఫరా పలు పరికరాలను ప్రయోగాత్మకంగా తయారు చేయబడిన వాటన్నిటిని పాఠశాలలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు సాయి గాయత్రి పాఠశాలను సందర్శించి విద్యార్థులు తయారుచేసిన పరికరాలను క్లుప్తంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాయిఈశ్వరి, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|