విద్యార్ధిని హత్య : ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: మొన్న దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటన మరవక ముందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వర్సిటీకి చెందిన అరుణ అనే లా కాలేజీ విద్యార్థినిని నిన్న చత్రినాక పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని దుండుగులు కొందరు సామూహిక అత్యాచారం చేసి హత్య మార్చారు. దీంతో ఓయూ విద్యార్థులు కదం తొక్కారు. కేసును త్వరగా చేధించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అఫ్జల్‌గంజ్‌ చౌరస్తాలో బైఠాయించారు.  దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి తమకు హామీ ఇస్తేగాని తాము ఇక్కడ నుంచి కదలబోమని వారు భీష్మించుకు కూర్చున్నారు. అరుణ మిత్రుడే తన మిత్రులతో కలిసి ఈ దురాగతానికి ఒడిగట్టడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేస్తోన్నారు.