విద్యార్ధులకు టీకాలను తప్పనిసరిగా వేయించాలి – డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలోని 10 , 16 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్ధులకు తప్పనిసరిగా డిప్తిరియా, టెటనస్ వ్యాక్సిన్లు వేయించేలా చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం అన్నారు.శనివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో డిప్తిరియా , టెటనస్ వ్యాక్సినేషన్లపై కలెక్టరేట్ లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్  పాఠశాలల్లోని 37516 అర్హత కలిగిన విద్యార్ధులు, బడి బయట ఉన్న విద్యార్ధులకు ఈ నెల 7 నుండి 17వ తేదీ వరకు ఉచితంగా  ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్య , విద్యా శాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు.దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన పిల్లలకు ఈ టికాలను వేయాల్సిన అవసరం లేదన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు డి‌ఈ‌ఓ అశోక్ ,  బి‌సి వెల్ఫేర్ ఆఫీసర్ అనసూర్య , ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ దయానంద రాణి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శంకర్ , మహిళా అభివృది శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ జ్యోతి పద్మ , డిపిఆర్ఓ ఏ.రమేష్ కుమార్, డి‌సి‌హెచ్ఎస్
డాక్టర్ వెంకటేశ్వర్లు , జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.