విద్యావాలంటరిని ఏర్పాటు చేసి చీకటి జీవితాల్లో అక్షరకాంతి నింపిన సమాజసేవకుడు-బలరాం జాధవ్.
నేరడిగొండఅక్టోబర్15(జనంసాక్షి) :మండలంలోని నారాయణ్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గ్రామస్తుల కోరిక మేరకు తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శనివారం రోజున సందర్శించారు.ఈ పాఠశాలలో ఒకే ఒక ఉపాద్యాయుడు పని చేస్తున్నాడు.1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక ఉపాద్యాయుడు బోధించడం పిల్లలకు ఎంత వరకు న్యాయం జరుగుతుందన్న ప్రశ్నలు గ్రామస్తులు అడగడంతో బలరాం చలించి తన సొంత ఖర్చులతో విద్యావాలంటీర్ ను ఏర్పాటు చేసి గొప్ప మానవతావాదనినిరుపించుకున్నారు. అంతే కాకుండా విద్యార్ధులకు స్కూల్ బ్యాగులు కూడా పంపిణీ చేసారు. రోజూ కళాశాలకు వెళ్ళే దారిలో ఉన్న వాంకిడి ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ బ్యాగులు లేని పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు.3 నెలల క్రితం కుమారి పాఠశాలలో కూడా తన సొంత ఖర్చులతో విద్యావాలంటీర్ ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.ఈకార్యక్రమంలోప్రధానో పాధ్యాయుడు శ్యామ్ రావ్ సర్పంచ్ రాజు విడిసి అధ్యక్షులు నవీన్,స్కూల్ చైర్మన్ గ్రామస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.