విద్యావ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే ఆందోళన
శ్రీకాకుళం, జూలై 30 : ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సూర్యారావు ఆరోపించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్య వ్యతిరేక విధానాల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ విద్యకు నోచుకోలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.రామారాజు, వై.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.