విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిన టీఆర్ ఎస్ ప్రభుత్వం

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్
 నర్సాపూర్. నవంబర్, 9, ( జనం సాక్షి )
విద్యావ్యవస్థ   టీఆర్ ఎస్ పూర్తిగా నిర్వీర్యం అయిందని   నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ఆరోపించారు. బుధవారం నాడు నర్సాపూర్ పట్టణంలో  విలేకర్ల సమావేశంలో  మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో   ప్రతి పనికి అధికారులు నాలుగు నుంచి ఐదు శాతం పర్సంటేజ్ అడుగుతున్నారని అన్నారు.  ముఖ్యంగా రెవెన్యూ శాఖలో విపరీతంగా అవినీతి విరిగిపోయిందని తెలిపారు.    రెసిడెన్షియల్ హాస్టల్లో పురుగుల బియ్యంతో విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారని  అన్నారు.  నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్లో సైతం పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపించారు. కాగా   కేవలం జీతం మీదే ఆధారపడి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో నెల నె ల  సక్రమంగా జీతాలు  రాక ప్రతినెల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  వెంటనే ప్రతి నెల ఉపాధ్యాయులకు రెగ్యులర్ గా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.  వారికి 31 జీవో గుదిబండగా మారిందని ఆరోపించారు.  ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ లు  గోడ రాజేందర్,  నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, రమేష్ ,నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ ఎన్ ఎస్ పి 1 సమావేశంలో మాట్లాడుతున్న  మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్