విద్యాసంస్థల ప్రక్షాలన

4

– ఒకే గొడుకు కిందికి విద్యావ్యవస్థ

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌ విద్యాశాఖపై సవిూక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త విద్యావిధానం రూపకల్పన అంశాలపై సవిూక్షలో చర్చించారు. అన్ని విద్యాసంస్థలను విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలి..విద్యావ్యవస్థ, ఉద్యోగాలపై సవిూక్ష జరగాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల వివరాలు విద్యార్థులకు తెలిసేలా విద్యావిధానం ఉండాలని అధికారులకు చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులకు రైల్వే, బ్యాంకింగ్‌, ఇతర ఉద్యోగాలపై సిలబస్‌లపై అవగాహన లేదు..ఇందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  అన్నిరకాల విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖకే అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మెడికల్‌, అగ్రికల్చర్‌, ఫార్మాలకు మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. ఎవరికి వారు ఇష్టారీతిన విద్యాసంస్థలు నిర్వహించడం వల్ల సమగ్రత లోపించిందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచే శిక్షణ అందడం లేదన్నారు. అన్ని రకాల విద్యాసంస్థలను ఒకే గొడుకు కిందకు తెచ్చే విషయమై సమగ్ర అధ్యయనం చేసి కొత్త విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటిని విధాన రూపకల్పన జరగాలని ఆదేశాలు జారీచేశారు. విద్యావ్యవస్థ అడ్డదిడ్డంగా, అస్థవ్యవస్థంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, స్టడీసర్కిళ్లు వేర్వేరు విద్యాసంస్థలు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయి. మైనార్టీల కోసం 60 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా నిధులు విడుదల చేసి విద్యాశాఖ నిర్వహణ నియంత్రణలో రెసిడిన్షియల్‌ స్కూళ్లు ఉంచాలి. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర శాఖల నిధులతో నడిచే విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీసర్కిళ్లు ఉన్నాయి. కార్మికశాఖ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుస్తున్నయి. ఇలా ఎవరికి వారుగా విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిన్నింటిని విద్యాశాఖ గొడుకు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఎవరికి వారుగా విద్యాసంస్థలు నిర్వహించడం వల్ల సమగ్రత లోపించిందని అన్నారు. . విద్యార్థులకు అవసరమైన విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంచే శిక్షణ అందడం లేదు. దేశంలో, రాష్ట్రంలో ఏయే ఉద్యోగ అవకాశాలున్నాయో తెలుసుకుని వాటికనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే పని కూడా జరగడం లేదు. స్టేట్‌ పబ్లిక్‌ కవిూషన్‌, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలపై మాత్రమే ప్రభుత్వం, విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఈ రెండే కాకుండా ఉద్యోగ అవకాశాలున్న పోటీపరీక్షలు దేశంలో అనేకం ఉన్నయి. రక్షణ, రైల్వే, బ్యాంకింగ్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నా వాటికి సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందడం లేదు. విద్యార్థులను ఆ పరీక్షల కోసం సిద్ధం చేయడం లేదు.

దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలున్న రంగాలు అనేకం పెరుగుతున్నయి. ఉద్యోగ అవకాశాలున్న రంగాలు కొత్త పుంతలు తొక్కతున్నయి. కొత్త ధోరణిలు, కొత్త అవకాశాలు వస్తున్నయి. ఐటీ రంగం విస్తరిస్తున్నది. అందులో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నయి. ఇంకా చాలా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవడం లేదు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఏఏ ఉద్యోగాలకు ఎంతమంది కావాలో విద్యాశాఖకు అంచనా ఉండాలి. దాని వల్ల విద్యార్థులను ఆయా ఉద్యోగాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు.