ఓట్ల చోరీపై కదలిన ఈసీ
` రాహుల్ విమర్శలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచే అవకాశం
న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్ విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. కర్ణాటక, బిహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈసీ సిద్ధమైనట్లు- తెలుస్తోంది. ఓట్ల చోరీ ఆరోపణల వేళ.. ఆదివారం సమావేశం నిర్వహించనున్నట్లు- సమాచారం. బిహార్‌లో రాహుల్ గాంధీ ’ఓటు- అధికార యాత్ర’ను ప్రారంభించనున్న రోజే ఈ సమావేశం ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప.. ఇతర అంశాలపై ఎన్నికల సంఘం అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించడం చాలా అరుదు. ఆదివారం నిర్వహించనున్న విూడియా సమావేశం వెనుక అసలు కారణాన్ని వెల్లడిరచనప్పటికీ.. కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సంబంధించినదని అధికారులు తెలిపారు. ప్రతిపక్షాలు ’ఓటు- చోరీ’ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని ఈసీ ఇప్పటికే తప్పుపట్టింది. తప్పుడు కథనాలకు కారణమయ్యే ప్రచారాన్ని చేసే బదులు ఆధారాలు చూపించాలని పేర్కొంది.బిహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీపై ప్రతిపక్షాలు కొంతకాలంగా పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లో ఓట్లు- చోరీకి గురయ్యాయని రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించారు. కర్ణాటకలోని ఒక్క మహాదేవపుర నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఈ ఆరోపణలకు లిఖితపూర్వంగా డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. లేనిపక్షంలో దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నడుమే కీలక సమావేశానికి సిద్ధమైనట్లు- తెలుస్తోంది.
లాపతా ఓట్..
` రాహుల్ డాక్యుమెంట్
` నిమిషం నిడివితో ఎక్స్‌లో పోస్టు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
` నేటినుంచి బీహార్‌లో ఓట్ అధికార్ యాత్ర
` సెప్టెంబర్ 1 వరకు బీహార్ అంతటా రాహుల్ పర్యటన
న్యూఢల్లీి/పాట్నా(జనంసాక్షి):ఓట్ చోరీకి పాల్పడుతోందంటూ ఎన్నికల కమిషన్‌పై వరుస విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చౌర్యంపై వ్యంగ్యాస్త్రాల్రు సంధించారు. హాస్యం, వ్యంగ్యం మేళవించిన స్పూఫ్ వీడియోను శనివారంనాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా, ప్రజల ఓటు- హక్కుపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆదివారం ’ఓటు- అధికార్ యాత్ర’ను చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రసాద్ సింగ్ తెలిపారు. ఆయన శనివారం పాట్నాలో జరిగిన విూడయా సమావేశంలో మాట్లాడుతూ.. బీహార్‌లో ఓటు- అధికార్ యాత్రను ససారం నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర బహుశా సెప్టెంబర్ 1న ముగియనుంది. ఈ యాత్ర ముగిసేవరకు రాహుల్ రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఈ యాత్ర కోసం ముందుగానే అనుమతులు తీసుకున్నాము. ఈ యాత్ర రాష్ట్రంలోని 25 జిల్లాలను కవర్ చేస్తుంది. ఆగస్టు 20, 25, 31 తేదీల్లో యాత్రకు విరామం. సెప్టెంబర్ 1 పాట్నాలో జరిగే ర్యాలీతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో బీహార్ అసెంబ్లీ ప్రతిపక్షనేత తేజస్వియాదవ్ పాల్గొంటారు. ఆర్‌జెడితోపాటు- ఇండియా బ్లాక్‌లోని ఇతర పార్టీలైన వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొనున్నారని ఆయన అన్నారు.బిహార్ ఓటర్ల జాబితాలో లోపాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ’లాపతా ఓటు-’ అనే -టైటిల్‌తో వీడియోను ఎక్స్‌లో శనివారం విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో.. పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి తన ఓటు- చోరీ చేశారని, ఇంకా లక్షల ఓట్లు- చోరీ అయ్యాయని అధికారులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసు సిబ్బంది చెక్ చేసి అందులో తమ ఓట్లు- కూడా గల్లంతుకావడంతో నిర్ఘాంతపోతారు. అలా ఆ వీడియా ముగుస్తుంది. దీనిని రాహుల్ తన అధికారిక ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ఓటర్లందరూ చైతన్యంతో ఓ ఉద్యమంలా ముందుకు సాగాలి. విూ ఓటు- చోరీ అయితే విూ ప్రాథమిక హక్కు చోరీ అయినట్లే అని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఉద్యమంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామన్నారు. ఓట్ల చోరీ అనేది ’డూ ఆర్ డై’ సమస్యగా కాంగ్రెస్ పేర్కొంది. ఓట్లు- గల్లంతైన వారి కోసం ఓ వెబ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. అందులో పోల్ ప్యానెల్ నుంచి ఓట్ల గల్లంతుకు వ్యతిరేకంగా నమోదు చేసుకోవడానికి, అధికారుల నుంచి జవాబుదారీతనం కోరడానికి, డిజిటల్ ఓటరు జాబితాల డిమాండ్‌కు మద్దతు తెలియజేయడానికి ఆ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.