విద్యుత్తు కోతను నిరసిస్తూ రైతుల ధర్నా
నిర్మల్: నిర్మల్ మండలం సోన్ ఉప విద్యుత్తు కేంద్రం వద్ద విద్యుత్తు కోతను నిరసిస్తూ రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. రాత్రి సమయంలో విద్యుత్తు కోత విధించటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని జాఫ్రాపూర్, కర్తాల్, సాకెర, గంజాల్ గ్రామ రైతులు ధర్నా నిర్వహించి అక్కడే అక్కడే బైఠాయించారు. విద్యుత్తు ఏడీ రామకృష్ణ అక్కడికి చేరుకుని ఇకపై కోతలు విధించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు.