విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లా అడవుల్లో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దమ్మపేట మండలం పారకలగండిలోని అటవీప్రాంతంలో విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మరణించిన సంఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియలేదు. మృతదేహాలను గ్రామానికి తరలించారు.