విద్యుత్‌షార్ట్ సర్కూట్ కారణాంగా ఇల్లు దగ్దం
కంగ్టి (జనంసాక్షి):- వారం రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు కావాల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రి, ఇతరత్రా వస్తువులు కొని తెచ్చి పెట్టారు. ఇంతలోనే అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని ఆతలాకుతలం చేసింది. విద్యుత్‌షార్ట్ సర్కూట్ కారణాంగా ఇల్లు పూర్తిగా దగ్గమైంది. దీంతో పెళ్లి వస్త్రాలు, సామత్రి కాలిబూడిదయ్యాయి. ఈ విషాధకర ఘటన కంగ్టి మండలం చౌకాన్‌పల్లి జీర్గితంగాలో సీమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తండాకు చెందిన గోగ్లానాయక్ రాఠోడ్ కూతురు శోభ వివాహం వారం రోజులోంల జరగాల్సి ఉంది. అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లి కోసం దుస్తులు, ఇతర సామగ్రి కొని తెచ్చిపెట్టుకున్నారు. ప్రమాధవశాత్తు సోమవారం రాత్రి ఇంట్లో విద్యుత్ షార్టు సర్కూట్ కారణంగా మంటలు లేచాయి. తండా వాసులంతా బిందెలతో నీళ్లు తెచ్చి ఆర్పె ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి యజామాని గోగ్లానాయక్ లేడు. కుంటుబీకులంతా ట్టుబట్టలతో మిగితారు. సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం జరిగిందని గోగ్లానాయక్ భార్య గజరీబాయి తెలిపారు. కంగ్టి ఎస్‌ఐ కమలాకర్, వీఆర్‌ఓ మల్లేశం మంగళవారం ఘటానా స్థలాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను తలులుసుకున్నారు. బాధితులకు ఆర్థికసాయం అందించాలని మాజీ ఎంపీటీసీ సభ్యుడు తానాజీ నాయక్, తండావాసులు గోపాల్‌నాయక్, బన్సీలాల్, బాబుసింగ్, దేవిదాస్ అధికారులను కోరారు.