విద్యుత్ కోతలపై తెరాస నాయకుల ఆందోళన
పూడూరు: పెరిగిపోతున్న విద్యుత్తు కోతలకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో సోమవారం మన్యగూడ విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి సమయాల్లో విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులు నష్ట పోతున్నారని పగటి సమయాల్లోనే రెండు విడతలుగా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.