విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నేతలు దీక్ష
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా నేతలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చేపట్టిన దీక్ష ఐదో రోజకు చేరింది. పెంచిన ఛార్జీలు పూర్తిగా తగ్గించే వరకూ దీక్ష కొనసాగిస్తామని పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేశారు. నిన్న అర్ధరాత్రి సమయానికి దీక్ష కొనసాగిస్తున్న 30 మందిలో పలువురి ఆరోగ్యం క్షీణించింది. గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆమెను నిమ్స్‌కు తరలించారు.