విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఎదుట నారాయణ బైఠాయింపు

హైదరాబాద్‌ : విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఈఆర్‌సీ ఛైర్మన్‌ ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఏలు వేయవద్దని మొరపెట్టుకున్నా  ఈఆర్‌సీ పట్టించుకోవడం లేదంటూ పోడియం మందు ఆందోళనకు దిగారు. ఎఫ్‌ఎస్‌ఏ విధానం రద్దు చేయాలని, గ్రామీణ ప్రాంతాలకు తక్కువ చార్జీలు వసూలు చేయాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. విచారణలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో బహిరంగ విచారణను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఈఆర్‌సీ ఛైర్మన్‌, సభ్యులు వెళ్లిపోయారు.