విద్యుదుత్పత్తిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదు
` స్పష్టం చేసిన కేంద్రం
దిల్లీ(జనంసాక్షి): విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.థర్మల్, జల, పవన, సౌర.. ఇలా ఏ వనరు నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం లేదని పేర్కొంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట విద్యుదుత్పత్తిపై అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం తెలిపింది. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.రాజ్యాంగంలోని షెడ్యూల్ పఎఎలోని లిస్ట్`ఎఎలో ఉన్న 45` 68 అంశాలపై పన్నులు, సుంకాలు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్రం గుర్తుచేసింది. ఈ జాబితాలో లేని వాటిపై ఏ పేరునా పన్నులు విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. లిస్ట్`ఎఎలోని 53వ అంశంలో పేర్కొన్నట్లుగా విద్యుత్ విక్రయం, వినియోగంపై మాత్రమే రాష్ట్రాలు పన్నులు విధించాలని పేర్కొంది. మరోవైపు రాష్ట్రం వెలుపల సరఫరా అయ్యే వస్తువులు, సేవలు లేదా రెండిరటిపై పన్నులు/సుంకాలు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని రాజ్యాంలోని ప్రకరణ`286 స్పష్టంగా పేర్కొంటోందని తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వినియోగించే లేదా ప్రభుత్వ అవసరాల నిమిత్తం కొనుగోలు చేసిన విద్యుత్‌పై పన్నులు విధించడాన్ని ప్రకరణ 287, 288 నిషేధిస్తోందని పేర్కొంది.అభివృద్ధి పేరుతో విద్యుత్ ఉత్పత్తిపై విధిస్తున్న పన్నులు/సుంకాలను రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రం కోరింది. ఏప్రిల్‌లోనే ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు జల విద్యుత్ ఉత్పత్తిపై అభివృద్ధి పేరుతో నీటి సెస్సును విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు దీన్ని నీటి సెస్సుగా పిలుస్తున్నప్పటికీ.. అది విద్యుత్ ఉత్పత్తిపై విధిస్తున్న పన్నుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనివల్ల రాష్ట్రాల వెలుపల ఉండే విద్యుత్ వినియోగదారులపై కూడా పన్ను విధిస్తున్నట్లవుతుందని తెలిపింది. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.