విధి నిర్వహణలో అసువులు బాసిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి –
జూలై 16 (జనం సాక్షి ) వార్త సేకరణ లో భాగంగా దురదృష్టవశాత్తు అసువులు బాసిన జగిత్యాల జిల్లా ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎల్లారెడ్డి పాత్రికేయుల ఆధ్వర్యంలో శనివారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తహసీల్దార్ మునీరుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు రాజ్ కుమార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జగిత్యాల జిల్లా లోని రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలో గోదావరి నదిలో 9 మంది వ్యవసాయ కూలీలు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారనే విషయాన్ని వార్తగా సేకరించే క్రమంలో జగిత్యాల జిల్లాలోని ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ నీటి ప్రవాహానికి కారుతో సహా కొట్టుకుపోయాడని అన్నారు. అనంతరం ప్రభుత్వ అధికారులు రెస్క్యూ టీం తో పాటు గజ ఈతగాళ్లతో ,ప్రత్యేక బృందాలతో గాలించినప్పటికిని 24 గంటల తర్వాత విగతాజీవిగా లభ్యమయ్యాడని తెలిపారు. అందువల్ల విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న జమీర్ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని, పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయులు కొండం గారి రాములు గౌస్ అలీ పిన్నురి రమేష్ వెంకట్. సంతోష్ కుమార్ శంబు లింగం లక్ష్మీనారాయణ సంజీవ్ పవార్ శివకుమార్ రాజగౌడ్ సంతోష్ అనీఫ్ , ఆయా పత్రికల విలేకరులు పాల్గొన్నారు.