విధుల్లో చేరిన విఆర్ఏలు.

వారి డిమాండ్లకు ప్రభుత్వం హామీ
పెద్దవంగర అక్టోబర్13 (జనంసాక్షి)తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విఆర్ఏలు గురువారం నిరవధిక సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. విఆర్ఏ జేఏసీ నాయకులు బుధవారం రోజు సీఎస్ సోమేశ్ కుమార్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో విధుల్లో చేరినట్లు పెద్దవంగర విఆర్ఏ జె ఎస్ సి తోట వేణు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ఉన్నందున నవంబర్ నెలలో జీవో విడుదల చేస్తామని సీఎస్ తెలపడంతో నిరవధిక సమ్మె విరమించి విధుల్లో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. నిరవధిక సమ్మెకు దిగిన విఆర్ఏలు అందరూ విధుల్లో చేరుతున్నట్లు స్థానిక తహసీల్దార్ జి రమేష్ బాబుకి విధుల్లో చేర్చుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక మండల వీఆర్ఏలు బాలరాజు, నాగరాజు, సతీష్, సోమయ్య, వెంకన్న, యాకన్న, జ్యోతి, వెంకటయ్య, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు