విధ్వంసాలకు పాల్పడవద్దు: హరీశ్‌రావు

హైదరాబాద్‌ : హింస మన మార్గం కాదు, విధ్వంసాలకు పాల్పడవద్దని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ వాదులకు సూచించారు. నిరసన తెలిపే ప్రజల ప్రాథమిక హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య యుతంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం అనుమతివ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తమ పోరాటమని వివరించారు.