వినాయక యూత్ సభ్యులకు బహుమతుల పంపిణీ
సంజయన్న యువసేన ఆద్వర్యంలో పోటీలు.
ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 13 , (జనం సాక్షి ) సంజయన్న యువసేన ఆద్వర్యంలో వినాయక నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపాల వద్ద సాంప్రదాయబద్ధంగా , డెకరేషన్ ,పూజ , ఆద్యాత్మిక ,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన యూత్ సంఘాలకు బహుమతులను అందించారు. ఈ మేరకు గత ఐదు సంవత్సరాలుగా మట్టి గణపతి పెడుతూ ఆదర్శంగా నిలిచిన డైనమిక్ యూత్ కి, ప్రధమ బహుమతి అందించారు. సాంస్కృతిక కార్యక్రమాల విభాగం నిర్వహిస్తూ,ఐకమత్యానికి సూచికగా నిలిచిన యంగ్ స్టార్ యూత్ కి ద్వితీయ బహుమతి అందించారు. నిత్యం భజన , పూజ కార్యక్రమాలు చేస్తూ నవరాత్రులలో క్రమశిక్షణతో మెదిలిన గంగపుత్ర యూత్ వారికి తృతీయ బహుమతి అందిచారు.
అలాగే భక్తి శ్రద్దలతో నవరాత్రులు నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ సంఘం వారికి ప్రోత్సాహ బహుమతిగా బహుమతి అందిచారు.ఈ విజేతలను గ్రామంలోని పురః ప్రముఖులు, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజా ప్రతినిధులు,విడిసి ప్రతి నిధులు ఎంపిక సేసి , వారి చేతులమీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్లెడ లక్షణ గంగాధర్ , ఉపసర్పంచ్ బట్టు శేఖర్ ,కార్యదర్శి మనోజ్ కుమార్ , టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు దాసరి చిన్న రాజన్న ,స్టాండింగ్ కమిటి సభ్యులు శేర గంగాధర్ ,జిపి సిబ్బంది రతన్ , విడిసి అధ్యక్షులు రెబ్బస్ గంగాధర్ , అనిల్ వెలిగేటి ,బెల్లాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.