వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా  అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు.శుక్రవారం ఇండేన్ గ్యాస్ ఫైబర్ సిలిండర్ ను కలెక్టరేట్ లోని ఆయన కార్యాలయం నందు ప్రారంభించి మాట్లాడారు.వినియోగదారుల సౌకర్యం కొరకు తక్కువ బరువు , పారదర్శకంగా కనిపించే నాణ్యత గల సిలిండర్ ను ఐఓసి ప్రవేశపెట్టడం అభినందనీయమని అన్నారు.అనంతరం సూర్యాపేట మహిత ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్న ఐఓసి ఆధ్వర్యంలో మహిళలకు, వృద్దులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ బరువు, మూడు పొరలతో కూడిన సురక్షితమైన ఇండేన్ ఫైబర్ గ్యాస్
సిలిండర్ ను  ప్రారంభించినట్లు చెప్పారు.ఈ సిలిండర్ పారదర్శకంగా ఉండటంవల్ల గ్యాస్ ఎంత ఉందో తెలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్ఓ విజయలక్ష్మి, ఎఎస్ఓ పుల్లయ్య , తోట శ్యాం ప్రసాద్ , తోట కమల తదితరులు పాల్గొన్నారు.