విపక్షాల అబద్దాలు నమ్మొద్దు

` తెచ్చుకున్న తెలంగాణలో మెట్టు మెట్టు ఎదుగుతున్నాం
` తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి బ్యూరో అక్టోబర్‌04 (జనంసాక్షి):విపక్షాల అబద్దాలు నమ్మొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన  ఏదుల మండలకేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ప్రారంభించి అనంతరం నిర్వహించిన సమావేశంలో  మంత్రి మాట్లాడుతూ సాగునీటిని తెచ్చుకోవడంతో తెలంగాణలో సేద్యం పెరిగిందని  పనులు చేసుకునేందుకు కూలీలు దొరక్క ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వలసలు వస్తున్నారని ,ఇక్కడ పనిచేసుకునే వారికి చేతినిండా పని ఉన్నదని విపక్షాలు అధికారం కోసం అడ్డగోలు హావిూలు ఇస్తున్నాయని తల్లికి బువ్వ పెట్టనోడు పినతల్లికి బంగారు చేయిస్తా అన్నట్లు విపక్షాల వ్యవహారం  ఉన్నదని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫించను రూ.వెయ్యికి మించి లేదని తెలంగాణలో రూ.2016 ఇస్తున్నామని తెలిపారు.ఒకనాడు ఎడ్ల బండ్లు దొరకని పరిస్థితి నుండి విశాలమైన రహదారులు గ్రావిూణ ప్రాంతాలలో నిర్మించుకున్నామని నీళ్లు, కరంటు, విద్య, వైద్యం, ఉపాధి విషయాలలో ఎలాంటి లోటు లేకుండా చేసుకున్నామని ,దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా అన్ని విషయాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని తొమ్మిదిన్నరేళ్లుగా తెలంగాణను ప్రణాళికాబద్దంగా నిర్మించుకుంటున్నామని ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ముందున్నదని చెప్పారు.ఏదుల మండలంలో మిగిలిన అన్ని గ్రామాలలో రహదారులు నిర్మిస్తామని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు,అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.