విప్ రేగా ఆదేశాలతో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన: జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
– సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సహకారంతో…
బూర్గంపహాడ్ ఆగష్ట్ 24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణంలోని బస్వప్ప క్యాంప్, గాంధీనగర్, భాస్కర్ నగర్ ఏరియాలలో రాజ్యసభ సభ్యులు ఎంపీ బండి పార్థసారథి రెడ్డి సహకారంతో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు బియ్యంతో పాటుగా పలు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన స్థానిక మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మాట్లాడుతూ
గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ముంపు ప్రాంతాలలో పరిశీలించడానికి రాలేదని, సీఎం కేసీఆర్ వాతావరణం అనుకూలించక పోయినప్పటికీ రోడ్డు మార్గాన వందలాది కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి వరద బాధితులను భద్రాచలం వచ్చి పరామర్శించారని వారు తెలిపారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో ఎత్తయిన ప్రదేశంలో కాలనీలు ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వరదల సమయంలో ఎప్పటికప్పుడు మండలంలోని అన్ని గ్రామాలు పర్యటించి సమస్యలను తెలుసుకొని సహాయక చర్యలలో పాల్గొన్నారని వారన్నారు. గోదావరి ముంపునకు గురైన ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వారి అకౌంట్లో నగదును జమ చేయడం జరిగిందన్నారు. రెండు నెలల పాటు 25 కిలోల బియ్యం పలు రకాలు నిత్యాసర వస్తువులను ప్రభుత్వం తరఫున అందజేయడం జరిగిందని అన్నారు. వరదల సమయంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు ఎప్పటికప్పుడు వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకొని సహాయక చర్యలలో పాల్గొన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కిసాని శ్రీనివాసరావు, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు గోనె దారుక్, మోహన్ రావు, పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు శ్రీహరి, తిరుపతి ఏసోబు, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గోనెల నాని, మండల కార్మిక విభాగం మర్రి సాంబిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుల్ మహమ్మద్, నియోజవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, బిట్రా సాయిబాబు, అరుణ్ ప్రసాద్, కనకాచారి, భూక్య శీను, బొబ్బిలి, టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు పంగి సురేష్, బానోత్ కృష్ణ, రంజిత్, చిరంజీవి, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు