విప్ రేగా సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు…
– మండల కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్…
– పాల్గొన్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, టిఆర్ఎస్ నాయకులు…
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం కాంగ్రెస్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బూర్గంపహాడ్ మండలానికి చెందిన వేపలగడ్డ సర్పంచ్ కుంజ చిన్న అబ్బాయి, కృష్ణ సాగర్ సర్పంచ్ కోడిమే వెంకటేశ్వర్లు, వేపలగడ్డ పీసా కమిటీ అధ్యక్షుడు మెండి భాస్కర్, వార్డు సభ్యులు తో సహా, గ్రామాల నుంచి భారీ ఎత్తున సుమారు 50 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా, ఎంతో అభివృద్ధి దిశగా సాగుతున్నదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నేతలు, టిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ పథకాలు, సంక్షేమం చూసి తట్టుకోలేక, అధికార పార్టీ పై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నార న్నారు. ప్రజల వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితిలో, ప్రజలు లేరని వివరించారు. కలిసికట్టుగా పార్టీ కోసం కృషిచేసి గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో పినపాక నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకు వెళతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గోనెల నాని, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామకొండ రెడ్డి, సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, గజ్జల లక్ష్మారెడ్డి, పోడియం నరేందర్, ఉండేటి గోవర్ధన్, అంతోటి రమేష్, గాదె నర్సిరెడ్డి, పోతిరెడ్డి గోవింద రెడ్డి, యడమకంటి సుధాకర్ రెడ్డి, తోకల సతీష్, కోట రమేష్, గంగరాజు, చల్లకోటి పూర్ణ, బిట్ర సాయిబాబు, పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరితా, టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షరాలు ఎల్లంకి లలితా కుమారి, టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.