విభజన సమస్యల పరిష్కారంలో వైఫల్యం
విభజన సమస్యలు, అసెంబ్లీ సీట్ల పెంపు, హైకోర్టు విభజన,ఉద్యోగుల పంపకాలు, కొత్త రాష్టాన్రికి రాజధాని నిర్మించడం,ఆర్థికంగా అండగా నిఅలబడడం వంటి సమస్యలన్నీ మిధ్య అని తేలిపోయింది. ఏదైనా ప్రభుత్వానికి గీటురాయి ఏంటంటే సమస్యలను ఎలా పరిష్కరించారో చూస్తే తెలుస్తుంది. ఆయా సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించారో వాటిని బట్టి కేంద్ర ప్రభుత్వ పనితీరును గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో కేంద్రం పనితీరు గత రెండేళ్లుగా పరిశీలిస్తున్నా పాజిటివ్ దృక్పథం కానరావడం లేదు. ఏడు మండలాలను ఆగమేఘాల విూద ఎపిలో కలుపడానికి చొరవ చూపిన తెగువ మిగతా విషయాలపైనా చూపాలి. సచివాలయం విభజించి ఇచ్చినప్పుడు హైకోర్టును కూడా విభజించాలి. కానీ రెండేళ్లుగా పార్లమెంటు వేదికగా పోరాడినా కేంద్రంలో చలనం లేదు. మోడీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అంటే మనం చెప్పడం కన్నా గ్రామాలకు వెళితే తెలుస్తుంది. మన్మోహన్ చలనం లేని ప్రధానిగా విమర్శించుకున్న వారికి మోడీ పాలన చూశాక పెద్దగా తేడా కనిపించడం లేదు. ఎందుకంటే సమస్యలనే కొలమానంగా చూస్తాం కాబట్టి వాటి ఆధారంగా బేరీజు వేస్తున్నారు. పెద్దగా కీలక నిర్ణయాలు తీసుకుంటే వాటి ఫలాలు ప్రజలకు చేరుతాయి కనుక ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు యూపిఎ అవినీతిపై నిత్యం మాట్లాడినే వారు కనీసం వాటిని నిరూపించి కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టలేకపోయారు. 3జి, బొగ్గు కుంభకోణం మొదలు అనేక విధాలుగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ ప్రభుత్వం కార్యశూన్యత కనిపిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ¬దా అవసరం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న హావిూలన్నీ నెరవేరుస్తాం. రాష్టాన్రికి ఏం కావాలో చట్టంలో ఉంది. వాటినే అమలు చేస్తున్నాం. విభజన చట్టంలోని అన్ని అంశాలను నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోందని,ఆర్థిక సాయంపై నీతి ఆయోగ్ నివేదిక ఇవ్వనుందని కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి హెచ్‌పి చౌదరి పేర్కొన్నారు. ఇది దేనికి సంకేమో తెలుసుకోవచ్చు. గతంలో వెంకయ్యనాయుడు కూడా ఇదే అర్థంలో చెప్పారు. కావాల్సింది నిధులు కనుక ప్రత్యేక ¬దాతో పనేముందన్నారు. ఇప్పుడు కూడా అదే విసయాన్ని గట్టిగానే చెప్పారు. అయితే దీనికి ప్రత్యమ్నాయంగా ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో చెబితే ఇకముందు ప్రత్యేక ¬దా అన్న అంశం ప్రస్తావనకురాదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇక లేదని తేలిపోయింది కనుక రాజకీయ నాయకులు కడా ఇదే విసయమై రాజకయీం చేయకుండా ఎపి అభివృద్దితో పాటు ఆర్థికంగా సాయం చేసే అంశాలపై పోరాడాలి. ఇప్పటివరకు ప్రత్యేక¬దా వస్తుందని ఆశతో ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్‌కు, కేంద్ర మంత్రి పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా నిరాశపరిచాయి. ఇక దీనిపై చర్చ చేయడం కూడా అనవసరమేనని గుర్తుంచుకోవాలి. రాజధాని లేకుండా కొత్త రాష్ట్రం ఏర్పడింది. పార్లమెంట్‌లో నాడు వెంకయ్యనాయుడుతో పాటు అందరూ ఇచ్చిన హావిూ ప్రకారం వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలి. రెవెన్యూ లోటులో రాష్ట్రం ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర మొత్తం ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే సహకరించి, 2018 లోపు పూర్తి చేయాలి. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి. వీటితో పాటు విభజన హావిూల మేరకు తెలంగాణకు కూడా న్యాయం జరగాలి. ఇలా రెండు రాష్టాల్రకు విభజన చట్టం అమలు చేయకుండా తప్పుడు ప్రకటనలు ఇస్తోందని కేంద్రం రుజువు చేసుకుంది. ఇవన్‌ఈనకూడా ఎవరు చేసినా, చేయకపోయినా ఎవరు ఎందుకు ఆపారో తెలిసినా ఇఆదంతా మోడీ పనితనం విూదకే వస్తుంది. పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గోరంత, దీని నిర్మాణానికయ్యే వ్యయం కొండంత
అని తేలిపోయింది. 2016 -17 బడ్జెట్‌లో కేంద్రం ఈ ప్రాజెక్టుకోసం వంద కోట్లు మాత్రమే కేటాయించిన విషయాన్ని మరచిపోరాదు. గతంలో మాటలు చెప్పిన బిజెపి నాయకులు ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నారని గమనించాలి. ప్రత్యేక ¬దా, పన్ను మినహాయింపు, రెవెన్యూ లోటు భర్తీకి పదేళ్ల పాటు పదివేల కోట్లు, వెనుకబడిన ఏడు జిల్లాలకు 30వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజి, పోవలరం కేంద్రమే పూర్తి చేయడం వంటివి వస్తాయని ఇంతకాలం ఆశగా ఉన్నారు. ఇకపోతే హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాచంద్రబాబు కావాలనే మోకాలడ్డుతున్నారన్నది జగద్విదితం. నిజంగానే కేంద్రం సహకరిండం లేదని బాబు కూడా అంటున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదన్నది గమనించాలి. కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి చౌదరి మాత్రం విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలు అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ఐఐపి, ఎన్‌ఐటి ఇచ్చాం. గిరిజన, సెంట్రల్ యూనివర్శిటీలకు స్థలాలు సేకరించామని, శాశ్వత భవనాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు ఇచ్చామని, రెండేళ్లలో 34వేల కోట్లు పన్ను మినహాయింపు ఇచ్చామని, రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2,050 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. పోలవరం జాతీయ ¬దా, రెండేళ్లలో వెయ్యి కోట్లు ఇచ్చామని, 2018లోపు పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి రైలు వేశామని, వైజాగ్ మెట్రో డిపిఆర్ తుది దశలో ఉందని తెలిపారు. ఇలా చెబుతున్న తరుణంలో కేంద్రం నుంచి ప్రత్యేక¬దా రాదని తేలిపోయింది. హైకోర్టు విబజనా జరగదని తేలిపోయింది. అమరావతి నిర్మించే వరకు దీనిని విభజించడం బాబుకు సైతం ఇష్టం లేదు. అందుకే అడ్డుకోవడానికి తన శక్తియుక్తులను ఉపచయోగిస్తున్నారు. దీనిబదులునిధులు రాబట్టేందుకు ఈ శక్తి వినియోగించి ఉంటే బాగుండేదేమో. ఏదేమయినా విభజన సమస్యల పరిసష్కరాంలో కేంద్రం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.