విభజన హామీలు పరిష్కరించండి
` తెలంగాణకు నిధులివ్వండి..రాష్రాభివృద్ధికి సహకరించండి
` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వినతి
` ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిభేటి
` రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి
` సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ
` తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని కోరాం
` ప్రధాని మోదీతో భేటి వివరాలు వెల్లడిరచిన భట్టి విక్రమార్క
న్యూఢల్లీి,డిసెంబర్26(జనంసాక్షి): తెలంగాణ అభివృద్దికి సహకరించాల్సిందిగా ప్రధాని మోడీని సిఎం ఏవంత్ రెడ్డి కోరారు. నిధులు విడుదల చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ మేరకు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కతో కలసి ఆయన ఢల్లీిలో ప్రధానిని ఆమన నివాసంలో కలుసుకుని వినతిపత్రం సర్పించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండిరగ్ లో ఉన్న బిల్లులపై చర్చించారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోదీ హావిూ ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజన హావిూకి సంబంధించిన పెండిరగ్ నిధులు, పెండిరగ్ ప్రాజెక్టుల మంజూరు కోసం కేంద్రాన్ని అభ్యర్థించారు. రాష్ట్ర పురోగతికి అవసరమైన విన్నపాల జాబితా పట్టుకుని రేవంత్, విక్రమార్క ఢల్లీికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలతో పాటు రాష్టాన్రికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లు, పెండిరగ్ నిధుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్టాన్రికి నిధులు రావాల్సి ఉంది. ఈ పథకం కింద హైదరాబాద్ మినహా అప్పటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు రావాల్సి ఉంది. గత మూడేళ్లకు సంబంధించి 1,350 కోట్ల రూపాయల గ్రాంటు పెండిరగ్‌లో ఉన్నాయి. వీటిని విడుదల చేయాలని ప్రధాని మోదీని, సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. అలాగే కృష్ణా జలాల పంపకాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా మొహించారు. ఏపీ పరిధిలో ఉన్న గేట్లకు కంచె ఏర్పాటు చేశారు. తమ నీళ్లను తాము వినియోగించుకుంటున్నామని చెప్పారు అక్కడి ఇరిగేషన్ అధికారులు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాబోయేది తమ ప్రభుత్వం అని నీటి పంపకాలపై ఇరు రాష్టాల్ర ఉన్నతాధికారుల తో కూర్చొని చర్చించుకుంటామన్నారు.
తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని కోరాం: భట్టి విక్రమార్క
ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే మొదటి సారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.మంగళవారం సాయంత్రం దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి భట్టి విక్రమార్క.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క విూడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలు వెల్లడిరచారు.’’పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం కోసం.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హావిూలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ, విభజన చట్టంలోని హావిూల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. విభజన హావిూలను త్వరితగతిన పరిష్కరించాలని కోరాం. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అందులో భాగంగా.. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరాం.ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని అడిగాం. నేషనల్ హైవేస్ అథారిటీకి సంబంధించి 14 ప్రపోజల్స్ అప్‌గ్రేడ్ కోసం పెండిరగ్‌లో ఉన్నాయని, వెంటనే మంజూరు చేయాలని కోరాం. విభజన చట్టం ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు పెండిరగ్‌లో ఉన్నాయి. వెంటనే మంజూరు చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలని కోరాం. భారాస నేతల ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశాం. అన్ని అంశాలపై ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇస్తామన్నారు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
‘పాలమూరు రంగారెడ్డి’కి జాతీయ హోదా కల్పించండి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మో దీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని తెలిపారని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున తెలంగాణలోనూ అదే మాదిరి పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని వారు కోరారు. తెలం గాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తొలిసారిగా దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివా సంలో మంగళవారం సాయంత్రం మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రా ష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను వారు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆంద్ర óప్రదేశ్ పునర్వి భజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, 2019`20, 21`22, 22`23, 23`24 సంవత్సరాలకు సంబంధించి పెండిరగ్ గ్రాంట్లు రూ.1800 కోట్లు విడుదల చేయాలని వారు ప్రధానమంత్రిని కోరారు. పెండిరగ్‌లో ఉంచిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2233 .54 కోట్లు (2022`23కు సంబంధించి రూ. 129.69 కోట్లు, 2023`24కు సంబంధించి రూ.1608.85 కోట్లు) వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన అంశాలు.రాష్ట్రంలో 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అందులో కేవలం రెండిరటికే ఆమోదం తెలిపారు. మిగతా 12 రహదారుల అప్‌గ్రేడ్‌నకు ఆమోదం తెలపాలిములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2023`24 విద్యా సంవత్స రంలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి. పునర్విభజన చట్టం ప్రకారం పూర్వ ఖమ్మం జిల్లా లో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం హావిూ ఇచ్చినందున దానిని వెంటనే నెరవేర్చాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దానికి అదనంగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి.2010లో నాటి కేంద్ర ప్రభు త్వం బెంగళూర్, హైదరాబాద్‌లకు ఐటీఐఆర్‌ను ప్రకటించింది. కానీ 2014లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ ఐటీ ఐఆర్‌ను పక్కనపెట్టారు.. హైదరా బాద్ ఐటీఐ ఆర్‌ను వెంటనే పునరుద్ధరించాలి..పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించడంతో దానికి రావల్సినన్ని నిధులు రానందున వెంటనే దానిని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలి.. ప్రతి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయా లనే ప్రతిపాదన ఉంది.. తెలంగాణలో ఐఐఎం లేనందున హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.. అందుకు తగిన స్థలం అందుబాటులో ఉంది. కేంద్రం కోరితే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక పాఠశాలలు రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో సైనిక స్కూల్ లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలి. భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్ని ప్రాం తాల్లో ఉన్నా దక్షిణాదిలో లేనందున పుణెలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ కంటోన్మెం ట్‌కు తరలించాలిరాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థల విభజన, పదో షెడ్యూల్‌లోని సంస్థల అంశాలను పరిష్కరించాలి. ఢల్లీిలోని ఉమ్మడి భవన్ విభజనకు సహకరించాలి.