విమానాశ్రయాల్లో ఎన్‌బీటీ బుక్‌స్టాల్స్‌

హైదరాబాద్‌: విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో నేషనల్‌ బుక్‌ట్రస్టు ఆధ్వర్యంలో పుస్తక దుకాణాల్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు నివేదికను మానవ వనరుల అభివృద్ధి శాఖ.. విమానాయాన, రైల్వే మంత్రిత్వ శాఖలకు పంపించింది. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచాలన్న ఉద్దేశంతోనే దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అన్ని భాషల పుస్తకాల్ని విక్రయించనున్నారు.