వియన్నాలో మసీదుల మూసివేత

న్యూఢిల్లీ,జూన్‌8(జనం సాక్షి ): యూరోప్‌ దేశం ఆస్టియ్రా సంచలన నిర్ణయం తీసుకున్నది. తమ దేశంలో ఉన్న ఏడు మసీదులను మూసివేయాలని నిర్ణయించింది. ఇస్లాం మత పెద్దలైన కొందరు ఇమామ్‌లనుకూడా దేశం నుంచి వెలి వేయాలని తీర్మానించింది. ఇస్లామిక్‌ రాజకీయాలకు చరమగీతం పాడాలని, మత సంస్థలకు అందుతున్న నిధులను నిలిపేయాలని ఆస్టియ్రా నిర్ణయించింది. వియన్నాలో ఉన్న టర్కీ మసీదును మూసివేస్తున్నట్లు ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కుజ్‌ తెలిపారు. అరబ్‌ మత పెద్దలు నడుపుతున్న మరో ఆరు మసీదులను కూడా మూసివేయనున్నారు. 2015లో రూపొందించిన చట్టం ప్రకారం.. విదేశాల నుంచి ఇస్లాం మత సంస్థలకు అందుతున్న నిధులను ఆపేయాలని నిర్ణయించారు. వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు రావడంతో మతమార్పిడులతో పాటు మతసమనం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు సమాచారం.