విలాస్‌రావ్ అంత్యక్రియలకు హజరుకానున్న ప్రదాని,సోనియాగాంధీ
లాతూరు: నిన్న స్వర్గస్తుడైన కేంద్ర మంత్రి, మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అంత్యక్రియలకు ప్రదాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీలు హజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం వారు లాతూరు చేరుకుని దివంగత నేత పార్థివ దేహనికి నివాళులర్పిస్తారు. అనంతరం వారు విలాస్‌రావ్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. వీరితో పాటు కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, శరద్ పవార్, మహరాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌చవాన్, బీజేపీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ, ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌థాకరే ఇంకా పలువురు మహరాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారు.